రామంతాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు.. బాధితుల ఆవేదన

40 ఏళ్లుగా పన్నులు, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నాం.. ఇప్పుడు ఇళ్లు కూల్చడం ఏమిటని ప్రశ్న

రామంతాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు.. బాధితుల ఆవేదన

రామంతాపూర్ : రామంతాపూర్‌లో ఎఫ్‌టీఎల్ (FTL) పరిధిలో ఉన్న నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ కూల్చివేతలతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 40 ఏళ్లుగా మున్సిపల్ పన్నులు, విద్యుత్ బిల్లులు చెల్లిస్తూ నివాసం ఉంటున్నామని, ఇన్నేళ్ల తర్వాత తమ ఇళ్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయని చెప్పి కూల్చివేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఏళ్ల తరబడి పన్నులు చెల్లిస్తూ నివాసం ఉంటున్న తమకు ఇప్పుడు ఇళ్లను కూల్చివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.మరోవైపు హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. కూల్చివేతల ప్రాంతంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

భూసేకరణ భూముల వివరాలు భూ భారతిలో నమోదు చేయాలి : కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ భూసేకరణ భూముల వివరాలు భూ భారతిలో నమోదు చేయాలి : కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్‌కర్నూల్ :  భూసేకరణ భూముల వివరాలను భూ భారతి రికార్డుల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు....
సీతానగర్ గ్రామంలో భూభారతి సర్వే
అమిత్ షా మహా పాదయాత్ర
పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో యువత రక్తదానం
పోలీస్ అమరవీరుల స్మారకంగా రక్తదాన శిబిరం
రాజంపేట తహసీల్దార్ కార్యాలయంలో రాష్ట్రీయ ఏక్తా దివస్ నిర్వహణ ప్రతిజ్ఞ
బద్రిగూడెంలో డీసీఎంఎస్ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం