డీఎస్‌ఎన్‌ఆర్‌లో యువతుల అండాల సేకరణ.. దుర్గాప్రసాద్ అరెస్ట్

దిల్‌సుఖ్‌నగర్ కాలేజీ విద్యార్థినులే లక్ష్యంగా అక్రమ వ్యాపారం.. 18 మంది యువతులను ప్రశ్నిస్తున్న పోలీసులు

డీఎస్‌ఎన్‌ఆర్‌లో యువతుల అండాల సేకరణ.. దుర్గాప్రసాద్ అరెస్ట్

హైదరాబాద్ :  నగరంలో మరో అక్రమ అండాల వ్యాపారం వెలుగులోకి వచ్చింది. దిల్‌సుఖ్‌నగర్ కాలేజీ విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని అండాల సేకరణ, విక్రయాలు చేస్తున్నట్లు అనుమానిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న దుర్గాప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్‌ఎన్‌ఆర్ ప్రాంతంలో యువతుల నుంచి అండాలను సేకరించి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రముఖ ఐవీఎఫ్ కేంద్రాలు, ఆస్పత్రులకు ఈ అండాలను సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారంలో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 18 మంది యువతులను ప్రశ్నిస్తున్నారు. అండాల సేకరణ, విక్రయాల వెనుక ఉన్న నెట్‌వర్క్, ఇతర వ్యక్తుల ప్రమేయంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News