అంత్యక్రియలకు ఆర్థిక సహాయం

మందమర్రి (మంచిర్యాల ) : స్థానిక రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రామగిరి శ్రీనివాస్ గత కోన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతు ఆదివారం తుది శ్వాస విడిచారు. వారి అకాలమరణం తీరనిలోటుగా భావిస్తూ పలువురు రాజకీయ పార్టీ నాయకులు,స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ దహన సంస్కారాల ఖర్చుల కోసం కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి 10వేలు,కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి తవక్కల్ విధ్యాసంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ 10వేల రూపాయలు,యువత జనం కోసం స్వచ్చందం సంస్థ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేష్ 10వేల రూపాయలు సహయంగా అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి ఎల్పుల సత్య నారాయణ,యువ నాయకులు బోద్దుల ప్రేమ్ సాగర్,గౌస్ కలీమ్, దేవెందర్ పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


