సింగరేణి కార్మిక గర్జనను విజయవంతం చేయాలి

ముత్తారం (పెద్దపల్లి) : రామగుండం ప్రాంతంలో ఈ నెల 14న నిర్వహించనున్న బీఆర్‌ఎస్ సింగరేణి కార్మిక గర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ముత్తారం మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్‌రెడ్డి,మాజీ సింగిల్ విండో చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. సింగరేణి కార్మికుల సమస్యలు,హక్కులపై నిర్వహించనున్న ఈ సభకు కార్మికులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు.సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సింగరేణి ప్రాంత అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమని, వారి సమస్యలు, హక్కులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇలాంటి సభలు ప్రాధాన్యత కలిగి ఉంటాయని పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


