బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో దుర్గాదేవి..

కుల్కచర్ల, వికారాబాద్ : కుల్కచర్ల మండలంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రారంభమైనాయి. ఉత్సవాల్లో భాగంగా కుల్కచర్ల మండలం అంతారం గ్రామంలో దళిత నవజ్యోతి యువజన సంఘం ఆధ్వర్యంలో దుర్గాదేవిని మండపంలో ప్రతిష్టించారు. ఉత్సవాల్లో మొదటి రోజు కావడంతో అమ్మవారిని పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించారు. దుర్గాదేవి ఉత్సవ మూర్తిని భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించారు. బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో దుర్గాదేవి దర్శనం ఇచ్చినట్లు యువజన సంఘం సభ్యులు తెలిపారు. ప్రతి రోజు ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలతో నవరాత్రి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు వారు తెలియజేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


