బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు దక్కే వరకు పోరాడాలి – మంత్రి వాకిటి శ్రీహరి

పార్టీలకతీతంగా బీసీలంతా ఐక్యం కావాలి– మంత్రి వాకిటి శ్రీహరి బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలి– మంత్రి వాకిటి శ్రీహరి

బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు దక్కే వరకు పోరాడాలి – మంత్రి వాకిటి శ్రీహరి

డిసెంబర్ 14న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలి-మంత్రి వాకిటి శ్రీహరిమక్తల్ మున్సిపాలిటీ లో బీసీలకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన హక్కులు, రిజర్వేషన్ల సాధన కోసం పార్టీలకతీతంగా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణలో కులగణన చేపట్టామని, దేశవ్యాప్తంగా తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారని మంత్రి గుర్తుచేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన ద్వారా బీసీలకు సంబంధించిన సమగ్ర గణాంకాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వాటి ఆధారంగా బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పరంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 47 శాతానికి పైగా అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. పార్టీల పరంగా అవకాశాలు కల్పించడమే కాకుండా బీసీలకు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన హక్కులను కేంద్ర ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే బీసీలు ఐదారు తరాలు వెనుకబడ్డారని, కనీసం రాబోయే తరాల భవిష్యత్తు కోసమైనా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.రాజకీయ పార్టీలను పక్కనపెట్టి బీసీల హక్కుల సాధన కోసం సమష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు పోరాడకపోతే రాబోయే తరాలు మనల్ని క్షమించవని స్పష్టం చేశారు.డిసెంబర్ 14న న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న కార్యక్రమానికి తెలంగాణ నుంచి బీసీలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. బీసీల ఐక్యతను, ఉద్యమ శక్తిని దేశానికి చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నర్వ మండల అధ్యక్షుడు బీసం చెన్నయ్య సాగర్,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వరి వేయొద్దని ప్రభుత్వ సూచనలు.. అయినా వరి సాగుకే రైతుల మొగ్గు! వరి వేయొద్దని ప్రభుత్వ సూచనలు.. అయినా వరి సాగుకే రైతుల మొగ్గు!
సిద్దిపేట జిల్లా ప్రతినిధి ;  సిద్దిపేట జిల్లా మొత్తంలో రైతులు అప్పుడే నార్లు పోయడం అప్పుడే దున్నకాలు కూడా అన్ని మండలాలలో వరికోసిన రైతులు ప్రారంభించారు ప్రభుత్వం...
ఆదిలాబాద్ లోఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి..చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే
సీతారాంపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం
యానగుందిని సందర్శించిన మాజీ ఎంపీ తనయుడు రాయపాటి రంగారావు
ఎల్ నినో వల్ల తాగు నీరు, పశుసంపద పై ప్రభావం - అదనపు కలెక్టర్ నగేష్
‘అడ్డొస్తే జేసీబీలతో తొక్కిస్తాం’ జెన్కో అధికారుల బరితెగింపు బెదిరింపులు!