ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం

బీజేపీ కార్యకర్తల శక్తిని తక్కువ అంచనా వేయొద్దు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీని, బీజేపీ కార్యకర్తలను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని నర్వ లోని తన ఫార్మ్ హౌస్ లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాటలను తీవ్రంగా ఖండించారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీని ఓడించి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డిని గెలిపించింది బీజేపీ కార్యకర్తలేనని, మల్కాజిగిరిలో ఈటల రాజేందర్‌ను, మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానంలో డీకే అరుణమ్మను గెలిపించింది కూడా బీజేపీ శ్రేణులేనని గుర్తు చేశారు.ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని, రాజకీయాల్లో ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదని హితవు పలికారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి బాధ్యతాయుతమైన వ్యాఖ్యలు చేయాల్సిన రేవంత్ రెడ్డి, అహంకారపూరితంగా రాజకీయ విమర్శలు చేయడం తగదన్నారు. గతంలో అధికార గర్వంతో విర్రవీగిన నాయకులు కాలగర్భంలో కలిసిపోయారని, అలాంటి పరిస్థితి ఎవరికైనా రావచ్చని హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తల బలం, ప్రజల మద్దతు రోజురోజుకూ పెరుగుతోందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ సత్తా ఏమిటో చూపిస్తామని స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, బీజేపీ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం మానుకోవాలని డాక్టర్ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కాసర్/కంచెరోని చెరువు ఆక్రమణలు తక్షణమే తొలగించాలి కాసర్/కంచెరోని చెరువు ఆక్రమణలు తక్షణమే తొలగించాలి
నిర్మల్, : నిర్మల్ మండలం, జిల్లా పరిధిలోని కాసర్/కంచెరోని చెరువు ఆక్రమణల కోరల్లో చిక్కుకుని తన ఉనికిని కోల్పోతోందని, చెరువు భూములను పరిరక్షించి అక్రమ ఆక్రమణలను తక్షణమే...
రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్.
దిశ ఘటనకు నేటికి ఏడేళ్లు, న్యాయం ఎక్కడ?
6 వ వార్డులో స్వంత ఖర్చుతో 4 మినీ వాటర్ ట్యాంక్ లు ప్రారంభం
తాడిచర్లలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
గ్రామపంచాయతీ ఉప సర్పంచ్, వార్డు సభ్యుల గ్రామపంచాయతీ ముందు నిరసన
ఇందిరమ్మ ఇంటితో పేద కుటుంబంలో కొత్త వెలుగులు