తాడిచర్లలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి సర్పంచ్ బండి స్వామి
మల్హర్ : మల్హర్ మండలంలోని తాడిచర్ల గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో అధికారులు, గ్రామ సర్పంచ్ బండి స్వామి ఆధ్వర్యంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బండి స్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా కుటుంబ పోషణ బాధ్యతలు నిర్వహించే యజమానికి జీవిత బీమా భరోసా కల్పించేందుకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆన్లైన్ దరఖాస్తుల నమోదు కోసం సదుపాయం కల్పించిందని తెలిపారు. దరఖాస్తు చేసుకునే వారు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ ప్రతులతో పాటు అవసరమైన ఇతర పత్రాలను తీసుకువచ్చి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చల్ల మహేందర్, ఇతర అధికారులు, అధిక సంఖ్యలో మహిళలు, రైతులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


