శ్రీధర్ బాబు చొరవతో విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం
తాడిచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతి హరే రామ హరే కృష్ణ సంస్థ సౌజన్యంతో భోజన వసతి
మల్హర్, : మల్హర్ మండల కేంద్రానికి సమీపంలోని తాడిచర్ల గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో, హరే రామ హరే కృష్ణ సంస్థ సౌజన్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భోజనం అందించడం పట్ల కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తాడిచర్ల గ్రామ సర్పంచ్ బండి స్వామి, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


