గ్రామపంచాయతీ ఉప సర్పంచ్, వార్డు సభ్యుల గ్రామపంచాయతీ ముందు నిరసన

కేజీ టు పీజీ ఉర్దూ మీడియం పాఠశాల ప్రక్కన నిర్మిస్తున్న వివో బిల్దిoగ్ అక్రమ నిర్మాణం ఆపివేయాలి

గ్రామపంచాయతీ  ఉప సర్పంచ్, వార్డు సభ్యుల గ్రామపంచాయతీ ముందు నిరసన

గంభీరావుపేట : గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మల్లు గారి పద్మ గారి భర్త గ్రామ పంచాయతీని మరియు గ్రామ ప్రజల చేత ఎన్నుకోబడ్డ వార్డ్ మెంబర్స్ చేసిన తీర్మానాలను కాదని తన ఇష్టానుసారంగా గంభీరావుపేట గ్రామంలోని కేజీ టు పీజీ విద్యా ప్రాంగణంలో ఉర్దూ మీడియం పాఠశాల వద్ద అక్రమ వివో బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నాడని, గతంలో అభివృద్ధి విషయంలో 9 వివో సంఘ భవనాల నిమిత్తమై 8 వివో సంఘ భవన నిర్మాణ నిమిత్తమైగ్రామపంచాయతీలో తీర్మానం చేశామని. అంతేకాకుండా అక్కడ కానీ స్థలాలు ఎంపిక చేయబడలేదు. అదేవిధంగా 9వ వివో సంఘమైన ఉర్దూ మీడియం పాఠశాల ప్రక్కన నిర్మిస్తున్నందున అక్కడ వద్దని అధికారులకు వినతి పత్రం అందించడం తర్వాత గ్రామపంచాయతీలో పాలకవర్గ తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్ జరుపగా అనుకూలంగా ముగ్గురు మాత్రమే వ్యతిరేకంగా కట్టవద్దని 13 మంది సంతకాలు చేయడం జరిగింది. ఎందుకంటే కేజీ టు పీజీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతమంతా భవిష్యత్తులో ఎడ్యుకేషన్ హాబుగా మారనున్నందున అక్కడ వద్దని చెప్పడం జరుగుతుంది తప్ప ఇందులో ఎలాంటి స్వార్థం లేదని ప్రజలు గమనించాలని కోరారు. కాబట్టి ఉప సర్పంచ్ గా అభివృద్ధి విషయంలో సహకరిస్తాం కానీ తన స్వార్థం కోసం విలువైన స్థలాలలో అవసరమైనవి కాకుండా అనవసరమైనవి కడితే వ్యతిరేకిస్తామని లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి అన్నారు. ఈట్టి నిరసనలో ఆయన వెంట 14వ వార్డు సభ్యులు పిట్ల శ్రీమతి మరియు రెండవ వార్డ్ చిలుక ప్రశాంత్ లు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కాసర్/కంచెరోని చెరువు ఆక్రమణలు తక్షణమే తొలగించాలి కాసర్/కంచెరోని చెరువు ఆక్రమణలు తక్షణమే తొలగించాలి
నిర్మల్, : నిర్మల్ మండలం, జిల్లా పరిధిలోని కాసర్/కంచెరోని చెరువు ఆక్రమణల కోరల్లో చిక్కుకుని తన ఉనికిని కోల్పోతోందని, చెరువు భూములను పరిరక్షించి అక్రమ ఆక్రమణలను తక్షణమే...
రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్.
దిశ ఘటనకు నేటికి ఏడేళ్లు, న్యాయం ఎక్కడ?
6 వ వార్డులో స్వంత ఖర్చుతో 4 మినీ వాటర్ ట్యాంక్ లు ప్రారంభం
తాడిచర్లలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
గ్రామపంచాయతీ ఉప సర్పంచ్, వార్డు సభ్యుల గ్రామపంచాయతీ ముందు నిరసన
ఇందిరమ్మ ఇంటితో పేద కుటుంబంలో కొత్త వెలుగులు