ఇందిరమ్మ ఇంటితో పేద కుటుంబంలో కొత్త వెలుగులు

జేపీ నగర్‌లో ఇందిరమ్మ నూతన గృహప్రవేశం లబ్ధిదారుల కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు

ఇందిరమ్మ ఇంటితో పేద కుటుంబంలో కొత్త వెలుగులు

కల్వకుర్తి : కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని జేపీ నగర్‌లో ఇందిరమ్మ పథకం ద్వారా మంజూరైన నూతన గృహానికి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కల్వకుర్తి శాసనసభ్యుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో మంజూరైన ఈ ఇంటిని కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ షానవాజ్ ఖాన్, స్థానిక కౌన్సిలర్ హుమ్లీ హన్మ నాయక్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన గృహంలోకి అడుగుపెట్టిన లబ్ధిదారుల కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడంలో ఇందిరమ్మ గృహ పథకం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు, యువ నాయకులు దున్న భాస్కర్, పడకంటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కాసర్/కంచెరోని చెరువు ఆక్రమణలు తక్షణమే తొలగించాలి కాసర్/కంచెరోని చెరువు ఆక్రమణలు తక్షణమే తొలగించాలి
నిర్మల్, : నిర్మల్ మండలం, జిల్లా పరిధిలోని కాసర్/కంచెరోని చెరువు ఆక్రమణల కోరల్లో చిక్కుకుని తన ఉనికిని కోల్పోతోందని, చెరువు భూములను పరిరక్షించి అక్రమ ఆక్రమణలను తక్షణమే...
రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్.
దిశ ఘటనకు నేటికి ఏడేళ్లు, న్యాయం ఎక్కడ?
6 వ వార్డులో స్వంత ఖర్చుతో 4 మినీ వాటర్ ట్యాంక్ లు ప్రారంభం
తాడిచర్లలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
గ్రామపంచాయతీ ఉప సర్పంచ్, వార్డు సభ్యుల గ్రామపంచాయతీ ముందు నిరసన
ఇందిరమ్మ ఇంటితో పేద కుటుంబంలో కొత్త వెలుగులు