దిశ ఘటనకు నేటికి ఏడేళ్లు, న్యాయం ఎక్కడ?

సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలుపై ప్రభుత్వం,న్యాయవ్యవస్థ సమాధానం చెప్పాలి! మనుషులను చంపే అధికారం ప్రభుత్వానికి దాని యంత్రాంగానికి లేదు. బాధిత కుటుంబాలను ఆదుకోండి. మానవ హక్కుల కార్యకర్త మద్దిలేటి

దిశ ఘటనకు నేటికి ఏడేళ్లు, న్యాయం ఎక్కడ?

మక్తల్  : 2019 లో హైదరాబాద్ శివార్లలోని చటాన్‌పల్లి వద్ద దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులుగా అరెస్టయిన నలుగురు వ్యక్తులు పోలీసుల కాల్పుల్లో మరణించిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.ఈ ఘటనపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.ఎస్. సిర్పూర్కర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల విచారణ కమిషన్ సమగ్రంగా విచారణ జరిపి 2022లో తన నివేదికను సమర్పించింది. కమిషన్ తన నివేదికలో పోలీసుల కాల్పులను ఆత్మరక్షణ చర్యగా అంగీకరించలేమని పేర్కొంటూ, సంబంధిత పోలీసు అధికారులపై హత్యకు సంబంధించిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. అంతేకాకుండా, ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురిలో ముగ్గురు ఘటన జరిగిన సమయంలో మైనర్లుగా ఉన్నట్లు కమిషన్ గుర్తించడం మరింత ఆందోళన కలిగించే అంశం. ఈ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలకు ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థ సమాధానం చెప్పాలి. సుప్రీంకోర్టు నియమించిన కమిషన్ నివేదికలో తీవ్రమైన నిర్ధారణలు ఉన్నప్పటికీ, సంబంధిత పోలీసు అధికారులపై సెక్షన్ 302 నమోదు చేయాలని సిఫారసు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ముగ్గురు మైనర్ల వయస్సుకు సంబంధించిన ఆధారాలు వెలుగులోకి వచ్చిన తర్వాత జువెనైల్ జస్టిస్ చట్టం ప్రకారం వారి హక్కుల ఉల్లంఘనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనేది ఈనాటి సమాధానం లేదు. పోలీసుల కాల్పుల్లో మరణించిన నలుగురి కుటుంబాలకు న్యాయం, న్యాయ సహాయం, పరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తూ బాధిత కుటుంబాలను రోడ్డున పడేసింది. మహిళలపై అత్యాచారాలు, హత్యలకు కఠినమైన చట్టపరమైన శిక్షలు విధించాలి. అదే సమయంలో నిందితులుగా ఉన్న వ్యక్తులకు కూడా రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు, న్యాయమైన విచారణ హక్కు ఉంటాయి. నేరం చేసిన వారిని చట్టం ప్రకారం శిక్షించడం న్యాయవ్యవస్థ బాధ్యత. నిందితులను విచారణ లేకుండా చంపడం న్యాయం కాదు.రాజ్యాంగం అందరికీ సమానంగా వర్తించాలి. పోలీసులు చట్టానికి అతీతులు కాదు. కావున కమిషన్ చాలా స్పష్టంగా పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపారని చెప్పినప్పటికీ పోలీసులపై న్యాయ విచారణ తూతూ మంత్రంగానే కొనసాగింది. దిశకు న్యాయం జరగాలని,అదే సమయంలో ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురి విషయంలోనూ చట్టబద్ధమైన న్యాయం మరియు ఘటన జరిగి ఏడేళ్లు గడుస్తున్నాకూడ బాధిత కుటుంబాలకు పరిహారం అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కనిపిస్తున్నది. కావున ప్రభుత్వం ఈనాటికైనా బాధిత కుటుంబాలను ఆదుకోవాలని మానవ హక్కుల సంఘం కార్యకర్త మద్దిలేటి డిమాండ్ చేశారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కాసర్/కంచెరోని చెరువు ఆక్రమణలు తక్షణమే తొలగించాలి కాసర్/కంచెరోని చెరువు ఆక్రమణలు తక్షణమే తొలగించాలి
నిర్మల్, : నిర్మల్ మండలం, జిల్లా పరిధిలోని కాసర్/కంచెరోని చెరువు ఆక్రమణల కోరల్లో చిక్కుకుని తన ఉనికిని కోల్పోతోందని, చెరువు భూములను పరిరక్షించి అక్రమ ఆక్రమణలను తక్షణమే...
రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్.
దిశ ఘటనకు నేటికి ఏడేళ్లు, న్యాయం ఎక్కడ?
6 వ వార్డులో స్వంత ఖర్చుతో 4 మినీ వాటర్ ట్యాంక్ లు ప్రారంభం
తాడిచర్లలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
గ్రామపంచాయతీ ఉప సర్పంచ్, వార్డు సభ్యుల గ్రామపంచాయతీ ముందు నిరసన
ఇందిరమ్మ ఇంటితో పేద కుటుంబంలో కొత్త వెలుగులు