నేరాల నియంత్రణపై ప్రత్యేక నిఘా

పెండింగ్ కేసుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు

నేరాల నియంత్రణపై ప్రత్యేక నిఘా

మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో ఎస్పీ శ్రీనివాసరావు ఐపీఎస్ మెదక్ : నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టడంతో పాటు పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పోలీస్ అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. తొలుత సిబ్బంది కిట్ బాక్సులను పరిశీలించి, అనంతరం స్టేషన్ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిరంతరం నిర్వహించాలని సూచించారు. దొంగతనాల నియంత్రణకు అనుమానితుల కదలికలపై నిఘా పెంచాలని, రాత్రి పెట్రోలింగ్‌ను పటిష్టం చేయాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారాన్ని సేకరిస్తూ అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా కట్టడికి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను చట్టప్రకారం పరిష్కరించాలని ఎస్పీ సూచించారు. కేసుల దర్యాప్తులో నాణ్యత, పారదర్శకత పాటిస్తూ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. డయల్ 112కు వచ్చే అత్యవసర కాల్స్‌పై తక్షణమే స్పందించి బాధితులకు సత్వర సహాయం అందించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంపొందించాలని తెలిపారు. ఈ తనిఖీలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు మహేష్, రాజశేఖర్ రెడ్డి, సందీప్ రెడ్డి, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

నేరాల నియంత్రణపై ప్రత్యేక నిఘా నేరాల నియంత్రణపై ప్రత్యేక నిఘా
మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో ఎస్పీ శ్రీనివాసరావు ఐపీఎస్ మెదక్ : నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టడంతో పాటు పెండింగ్ కేసుల పరిష్కారానికి...
స్థానికుల ఇళ్లన్నీ జాబితాలో చేర్చే వరకు పనులు సాగనివ్వం!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
రైతుల అభ్యున్నతే లక్ష్యంగా కిసాన్ మేళా:
చట్టాలపై ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి...
ఎగువ మానేరు జలాశయం నుండి యాసంగి పంటలకు నీటిని విడుదల చేయాలి
గాంధీ ఆసుపత్రిలో బాలుడికి ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స