డాన్స్ మాస్టర్ శేఖర్‌ను పరామర్శించిన జర్నలిస్టులు

రోడ్డు ప్రమాదంలో గాయపడిన శేఖర్‌కు రూ.5 వేల ఆర్థిక సాయం

డాన్స్ మాస్టర్ శేఖర్‌ను పరామర్శించిన జర్నలిస్టులు

కల్వకుర్తి : పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన జర్నలిస్టు, డాన్స్ మాస్టర్ ఏదుల శేఖర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న శేఖర్‌ను టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జాతీయ కౌన్సిల్ సభ్యులు పరామర్శించారు. జాతీయ కౌన్సిల్ సభ్యులు గోలి సుదర్శన్ రెడ్డి, కృష్ణయ్య, దుబ్బ నాగేష్, కస్తూరి శ్రీనివాస్, రాంచందర్, జహీర్ తదితరులు శేఖర్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శేఖర్ ధైర్యంగా ఉండాలని, త్వరగా కోలుకుని సాధారణ జీవితంలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు. కష్టకాలంలో జర్నలిస్టులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజన్న, నరేష్ గౌడ్, సల్లు, హబీబ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
అందోల్ : పాపన్నపేట సబ్ డివిజన్ పరిధిలోని 4 మండలాలకు చెందిన ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నిర్వహించనున్నట్లు ఏఈ నవాజ్ ప్రకటించారు.ఈ మేరకు...
చౌటకూర్‌లో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యకు శ్రీకారం
కోయిలకొండ మండలంలో దారుణం.. చింతల్ తాండాలో మహిళ హత్య! ‎
డాన్స్ మాస్టర్ శేఖర్‌ను పరామర్శించిన జర్నలిస్టులు
కుక్కలు అడ్డురావడంతో అదుపుతప్పిన బైక్.. యువకుడికి తీవ్ర గాయాలు
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయ భూములకు డిజిటల్ సర్వే