ఢిల్లీ లో ఓటు బచావో దేశ్.... బచావో ర్యాలీలో పోచారం భాస్కర్ రెడ్డి
బాన్సువాడ ఢిల్లీలో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ ర్యాలీ కి ఆదివారం హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. ఢిల్లీ లోని చారిత్రాత్మక రామ్‌లీలా మైదానం లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వం లోని ‘ఇండియా’ కూటమి ఆధ్వర్యం లో నిర్వహించిన ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ భారీ బహిరంగ సభ లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీ తో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఇతర రాష్ట్ర, జాతీయ నాయకులు పాల్గొన్న సభ లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి బాన్సువాడ నుండి సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల తో కలిసి హాజరయ్యారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ( సార్) ప్రక్రియ లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ, ఎన్నికల వ్యవస్థ పారదర్శకత ను కాపాడాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కు పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం నిర్వహించిన ఈ కార్యక్రమం లో బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల తో పాటు ఇండియా కూటమికి చెందిన వివిధ పార్టీల జాతీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


