ఉప్పర్ గూడెంలో   డీసీఎంఎస్ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు – కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి అభిలాష్ యాదవ్ 

ఉప్పర్ గూడెంలో   డీసీఎంఎస్ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

చౌటకూర్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని ఉప్పర్ గూడెంలో గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వరి కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి అభిలాష్ యాదవ్  మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ధాన్యాన్ని విక్రయించే సమయంలో ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి తగిన లబ్ధి పొందాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు నందికంటి రామచంద్రారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు మల్లారెడ్డి, రాజశేఖర్, మల్లికార్జున గౌడ్, భాస్కర్, కాశీ, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచులు గొల్ల మహేష్ యాదవ్, చింత చంద్రయ్య, వెండికోల్ రాములు, ప్రభాకర్ రెడ్డి, సంజయ్ కుమార్, పార్టీ సలహాదారు శివకుమార్, కాంగ్రెస్ మండల యువజన ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, వినయ్ కుమార్, పలువురు మండల నాయకులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.

Views: 62

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఉప్పర్ గూడెంలో   డీసీఎంఎస్ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం ఉప్పర్ గూడెంలో   డీసీఎంఎస్ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
చౌటకూర్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని ఉప్పర్ గూడెంలో గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఘనంగా ప్రారంభించారు....
అడ్వాలపల్లిలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం
పందిల్ల టోల్ గేట్ నిర్మాణం పనులు ఆలస్యంగా జరగడం వలనే వాహనాదారులకు ఇబ్బందులు
ఎల్లమ్మ తల్లి టీ-స్టాల్ షాప్‌ ను ప్రారంభించిన...రమావత్.రవి నాయక్
అడ్వాలపల్లిలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం
జిల్లాస్థాయి క్రీడోత్సవాల్లో ఎడ్లపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ
70వ ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి పాఠశాలల అథ్లెటిక్స్ పోటీలలో హుస్నాబాద్ విద్యార్థికి ప్రథమ స్థానం