కుక్కలు అడ్డురావడంతో అదుపుతప్పిన బైక్.. యువకుడికి తీవ్ర గాయాలు
తాడిచెర్ల హనుమాన్ సెంటర్‌లో రోడ్డు ప్రమాదం.. 108లో ఆసుపత్రికి తరలింపు
మల్హర్ : మండల కేంద్రమైన తాడిచెర్ల హనుమాన్ సెంటర్‌లో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తాడిచెర్ల గ్రామానికి చెందిన నూతి శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డాడు.వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాంత్ ద్విచక్ర వాహనంపై హనుమాన్ సెంటర్ నుంచి తన ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో అకస్మాత్తుగా కుక్కలు అడ్డుగా వచ్చాయి. దీంతో బైక్ అదుపుతప్పి కిందపడటంతో శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు సమాచారం అందించడంతో 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన శ్రీకాంత్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


