ఆరోగ్య పరిరక్షణే మనందరి ప్రథమ కర్తవ్యం: జిల్లా కలెక్టర్ రాజర్షిషా

ఆరోగ్య పరిరక్షణే మనందరి ప్రథమ కర్తవ్యం: జిల్లా కలెక్టర్ రాజర్షిషా

ఆదిలాబాద్ బ్యూరో  : ఆదిలాబాద్ జిల్లాలో వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని, ప్రజలందరూ ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. గురువారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని నాగోబా విద్యార్థి నిలయంలో శంకర నేత్రాలయ హైదరాబాద్, వనవాసీ కళ్యాణ్ పరిషత్ (తెలంగాణ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పొర చికిత్సల ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆయన ఐటీడీఏ పీవో మంద మకరందు, సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్ తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్, పిఓ వైద్యులు, రోగులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్యం మెరుగ్గా ఉంటేనే వ్యవసాయం, చదువులు, వ్యాపారాలు అన్ని రంగాలలో రాణించవచ్చని తెలిపారు. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కేవలం తీవ్రమైన అనారోగ్య సమయాల్లో లేదా చివరి దశలో మాత్రమే ఆర్ఎంపీల వద్దకు వెళ్లే ధోరణిని మార్చుకోవాలని, ప్రాథమిక దశలోనే అర్హులైన ప్రభుత్వ వైద్యులను లేదా నిపుణులను కలవాలని స్పష్టం చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో అక్టోబర్ 31 వరకు కంటి పరీక్షలు నిర్వహించి, నవంబర్ 1 వరకు కంటి ఆపరేషన్లు కొనసాగుతున్నాయని వెల్లడించారు. కేవలం కంటి పరీక్షలు, ఆపరేషన్లే కాకుండా, అవసరమైన వారికి తదుపరి ఫాలో-అప్ సేవలు సైతం పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత పేదలకు ఇటువంటి సద్వినియోగ శిబిరాలు ఎంతో ప్రయోజనకరమని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రాజెక్ట్ ఆఫీసర్ మంద మకరందు మాట్లాడుతూ.. గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇటువంటి మొబైల్ క్యాంపులు ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రత్యేక కంటి వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్న సామాన్యులకు ఈ శిబిరాలు గొప్ప అవకాశమని, ప్రజలు ఆరోగ్యంపై మరింత చైతన్యం కలిగి ఉండాలని అన్నారు. 
ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో ఇప్పటివరకు 568 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, అందులో 150 మందిని కంటి పొర ఆపరేషన్లకు ఎంపిక చేయగా, నిన్నటివరకు 30 మందికి, ఈరోజు మరో 30 మందికి విజయవంతంగా ఆపరేషన్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు కలెక్టర్‌కు వివరించారు. 
ఈ కార్యక్రమంలో వనవాసీ కళ్యాణ్ పరిషత్ కార్యకర్తలు సిడామ్ భీమ్రావు, హెచ్.కె. నాగు, ప్రకాష్, అజయ్, శంకర నేత్రాలయ కోఆర్డినేటర్ రాజు, వైద్యులు, స్థానిక సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మెట్ పల్లి మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్ల మూకుమ్మడి వాకౌట్‌! మెట్ పల్లి మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్ల మూకుమ్మడి వాకౌట్‌!
మెట్ పల్లి డివిజన్ : మెట్ పల్లి మున్సిపాలిటీలో పాలకవర్గం, కౌన్సిలర్ల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ మైలారపు లింబాద్రి వ్యవహారశైలిని నిరసిస్తూ మున్సిపాలిటీ సాధారణ...
ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాల చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్ట్
ఆరోగ్య పరిరక్షణే మనందరి ప్రథమ కర్తవ్యం: జిల్లా కలెక్టర్ రాజర్షిషా
జీఎంపీవీఎస్ సిద్దిపేట, జనగామ జిల్లాల ఇంచార్జిగా అందె అశోక్.
ప్రతి ఓటమి నుండి ఒక పాఠం నేర్చుకోవాలి
జిల్లా పంచాయతీ అధికారి ఆకస్మిక పర్యటన
ఎండుతున్న పంటను చూసి ఆవేదన.. గుండెపోటుతో రైతు మృతి