ఘట్కేసర్ సీఐ బాలస్వామి సస్పెన్షన్?

సివిల్ వివాదాల్లో జోక్యం, అవినీతి ఆరోపణలు.. సీపీ ఆదేశాలతో విచారణ

ఘట్కేసర్ సీఐ బాలస్వామి సస్పెన్షన్?

హైదరాబాద్, : ఘట్కేసర్ సీఐ బాలస్వామిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడం, అవినీతి వ్యవహారాలు, విధి నిర్వహణలో అలసత్వానికి సంబంధించి ఆయనపై ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ఆదేశాల మేరకు విచారణ చేపట్టినట్లు పోలీసు వర్గాల సమాచారం.విచారణలో ఆరోపణలు నిర్ధారణ కావడంతో బాలస్వామిని సస్పెండ్ చేసినట్లు అంతర్గత సమాచారం వెలువడింది. అయితే, ఈ సస్పెన్షన్‌పై పోలీసు శాఖ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. దీంతో సస్పెన్షన్‌కు సంబంధించిన వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.ఇదిలా ఉండగా, గతంలో ఘట్కేసర్ సీఐగా పనిచేసిన మరో అధికారి కూడా దసరా పండుగ సమయంలోనే సస్పెన్షన్‌కు గురికావడం గమనార్హం. తాజాగా బాలస్వామిపై సస్పెన్షన్ వార్తలు వెలువడటంతో పోలీసు వర్గాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉండటంతో సస్పెన్షన్‌కు సంబంధించిన వివరాలను పోలీసు శాఖ ప్రకటన తర్వాత నిర్ధారించాల్సి ఉంది

Views: 336

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మత్తడి వాగు కెనాల్‌కు నీటి ని విడుదల చేసిన  ఎమ్మెల్యే అనిల్ జాదవ్,  ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి   మత్తడి వాగు కెనాల్‌కు నీటి ని విడుదల చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
ఆదిలాబాద్ బ్యూరో  : రైతుల సాగునీటికోసం ఎదురుచూపులకు తెరదించుతూ తాంసి మండలంలోని మత్తడి వాగు కెనాల్‌కు నీటిని విడుదల చేయడం స్థానిక రైతన్నలకు ఎంతో ఊరటనిచ్చే పరిణామమని...
1న ఆదిలాబాద్ పట్టణంలో జరిగే రైతు గర్జన సభను విజయవంతం చేయాలి - బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే జోగు,బాల్కసుమన్
మంత్రులను కలిసిన గంభీరావుపేట ఏఎంసీ చైర్మన్ మరియు పాలక వర్గం
మల్లారం సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ శివంపేటలో ఈ-వేస్ట్‌పై అవగాహన కార్యక్రమం
శివన్నగూడెం పనులను వెంటనే పూర్తి చేయాలి
న్యూ నలంద పాఠశాలలో ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్