పట్టపగలే ఇంట్లో చోరీ.. వెండి ఆభరణాలు, నగదు అపహరణ
శివంపేట : శివంపేట మండలంలోని పిల్లుట్ల గ్రామంలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. బబ్బురి మహేష్ యాదవ్ ఇంట్లోకి చొరబడిన దుండగులు 20 తులాల వెండి పట్టగొలుసులు, 12 తులాల వెండి కడియాలతో పాటు రూ.35 వేల నగదును అపహరించారు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఈ చోరీ జరిగినట్లు సమాచారం. ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు వివరాలు సేకరించారు. వరుస దొంగతనాలతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. దొంగలను గుర్తించి చోరీ సొత్తును రికవరీ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


