పంచాయతీ కార్యదర్శిపై దుర్భాషలు.. విధులకు ఆటంకం
రుద్రారం పంచాయతీకి అదనపు బాధ్యతలు చేపట్టబోమని కార్యదర్శుల ఏకగ్రీవ నిర్ణయం
ఎంపీడీవో, జిల్లా పంచాయతీ అధికారులకు వినతిపత్రం
మల్హర్ రావు : మల్హర్ రావు మండల పరిధిలోని రుద్రారం గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శిపై దుర్భాషలాడుతూ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ మండలంలోని పంచాయతీ కార్యదర్శులందరూ నిరసన వ్యక్తం చేశారు.రుద్రారం గ్రామపంచాయతీకి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి బి. శివప్రసాద్‌ను శనివారం గ్రామ సర్పంచ్ చంద్రగిరి సంపత్, 7వ వార్డు సభ్యుడు చంద్రగిరి అశోక్ దుర్భాషలాడుతూ విధులకు ఆటంకం కలిగించారని కార్యదర్శులు పేర్కొన్నారు.
ఈ ఘటనపై స్పందించిన మండలంలోని 12 మంది పంచాయతీ కార్యదర్శులు ఏకమై ఎంపీడీవో క్రాంతికుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రుద్రారం గ్రామపంచాయతీకి మండలంలోని ఏ పంచాయతీ కార్యదర్శికి కూడా అదనపు బాధ్యతలు అప్పగించకూడదని, కార్యదర్శిపై దుర్భాషలాడిన సర్పంచ్, వార్డు సభ్యుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా కోరారు.అనంతరం జిల్లా పంచాయతీ అధికారిని కలిసి కూడా వినతిపత్రం సమర్పించారు. విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు శివప్రసాద్, సతీష్, సాయి చరణ్, భాస్కర్, మధుకర్, సీహెచ్. రాజు, పి. రాజు, ప్రవీణ్ రాజ్, అపర్ణ, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


