బుసారెడ్డిపల్లి గ్రామానికి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి
మంత్రి దామోదర రాజనర్సింహ సర్పంచ్ రేణుక-వెంకట్ రాములు వినతి
చౌటకూర్ : మునిపల్లి మండలంలోని బుసారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్ రేణుక వెంకట్ రాములు గారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం బుధవారం నాడు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.బుసరెడ్డిపల్లి గ్రామంలో ప్రధానంగా మూడు డిమాండ్లపై మంత్రి గారికి విన్నవించారు. ఇండ్ల స్థలాల కేటాయింపు లో
గ్రామంలోని సర్వే నెంబర్ 127 మరియు 415 లో గల ప్రభుత్వ భూమిని పరిశీలించి, గ్రామంలో ఇండ్లు లేని నిరుపేద, అర్హులైన కుటుంబాలకు ప్లాట్స్ చేసి ఇచ్చేందుకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. మల్లన్న స్వామి ఆలయానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని అలాగే
గ్రామ చెరువు కట్ట వైపు, సర్వే నెంబర్ 415 లోని డ్యామ్ బ్యాక్ వాటర్ వైపు ఉన్న ప్రసిద్ధ శ్రీ మల్లన్న స్వామి ఆలయానికి వెళ్లే దారిలో భక్తుల సౌకర్యార్థం కరెంటు స్తంభాలు మరియు ట్రాన్స్ ఫార్మర్ ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.గ్రామ అభివృద్ధి పనులు గ్రామ అభివృద్ధిలో భాగంగా కొత్త గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మరియు ఇతర మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని మంత్రి గారిని కోరారు.ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ గారు సానుకూలంగా స్పందిస్తూ, బుసారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తామని, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ రేణుక -వెంకటరాములు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ పడమటి సంతోష్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామ్ శెట్టి పటేల్, ఇంద్రసేన రెడ్డి, సభా ప్రభు, గడీల సంగమేశ్వర్, ముస్తఫా, ఉస్మాన్ న్యాయవాది, షంషోద్దీన్ మరియు గ్రామ పెద్దలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


