రైతుల అభ్యున్నతే లక్ష్యంగా కిసాన్ మేళా:

రేపు జిల్లెళ్ల వ్యవసాయ కళాశాలలో నిర్వహణ.

రైతుల అభ్యున్నతే లక్ష్యంగా కిసాన్ మేళా:

బోయినపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా...రైతుల అభ్యున్నతి కోసం ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెరుగైన సాగు విధానాలపై అవగాహన కల్పించేందుకు ఆత్మ పథకం ఆధ్వర్యంలో కిసాన్ మేళా నిర్వహించనున్నారు. ఈ నెల 28వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జిల్లెళ్ల వ్యవసాయ కళాశాలలో ఈ కార్యక్రమం జరగనుంది.ఈ కిసాన్ మేళాలో రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, మెరుగైన విత్తన రకాలు, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయ యంత్ర పరికరాలు, ప్రభుత్వ పథకాలు, వివిధ ఆధునిక వ్యవసాయ కార్యక్రమాల గురించి నిపుణులు అవగాహన కల్పించనున్నారు.రైతులు వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకొని, అధిక దిగుబడులు సాధించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా లోని అన్నిమండలాల నుండిరైతు సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కిసాన్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని PD, ఆత్మ రాజన్న సిరిసిల్ల అధికారులు కోరారు.ఈ కార్యక్రమానికి హాజరయ్యే రైతులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించామని పేర్కొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కాసర్/కంచెరోని చెరువు ఆక్రమణలు తక్షణమే తొలగించాలి కాసర్/కంచెరోని చెరువు ఆక్రమణలు తక్షణమే తొలగించాలి
నిర్మల్, : నిర్మల్ మండలం, జిల్లా పరిధిలోని కాసర్/కంచెరోని చెరువు ఆక్రమణల కోరల్లో చిక్కుకుని తన ఉనికిని కోల్పోతోందని, చెరువు భూములను పరిరక్షించి అక్రమ ఆక్రమణలను తక్షణమే...
రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్.
దిశ ఘటనకు నేటికి ఏడేళ్లు, న్యాయం ఎక్కడ?
6 వ వార్డులో స్వంత ఖర్చుతో 4 మినీ వాటర్ ట్యాంక్ లు ప్రారంభం
తాడిచర్లలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
గ్రామపంచాయతీ ఉప సర్పంచ్, వార్డు సభ్యుల గ్రామపంచాయతీ ముందు నిరసన
ఇందిరమ్మ ఇంటితో పేద కుటుంబంలో కొత్త వెలుగులు