16 వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం

కౌన్సిలర్ అలుకూరి పావని

16 వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం

"మున్సిపాలిటీ 16వ వార్డులో.‌ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు,గురువారం రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి. గణేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజయ్య, తో కలిసి స్థానిక వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి బీమా ఉండాలనే ఉద్దేశంతో,సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా కల్పించే విధంగా,ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. గతంలో రైతు బీమా, మరికొందరి వర్గాలకు బీమా పథకాలు ఉండేవని, భూములు లేని వారు ఇతర చాలా వర్గాల వారు బీమా పొందలేకపోయారని,వారందరిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కనీసం ఐదు లక్షల జీవిత బీమా వర్తించేలా,ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని తీసుకొచ్చారని అన్నారు. ప్రతి ఇంటిలో కుటుంబ పెద్ద కు బీమా వర్తిస్తుందని, ఎవరి పేరిట బీమా తీసుకోవాలో కుటుంబ సభ్యుల నిర్ణయించుకోవాలని సూచించారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ జీవిత బీమా కు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ఖాదర్,మున్సిపల్ ఏఈ నాగశివ.కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ అల్కూరి రవికుమార్, కో ఆప్షన్ మెంబర్ వల్లంపల్లి లక్ష్మణ్, శంషుద్దీన్, ఉషాముద్దీన్ మిస్కిన్ నాగరాజ్, మార్కెట్ డైరెక్టర్ శాలం, వార్డు ఆఫీసర్ విష్ణప్ప, జగదీష్,స్థానిక నాయకులు,రమేష్, రాజశేఖర్, గోపాల్, మహమ్మద్, వలి, అన్వార్,గఫార్, కిరాలింగ, అక్తర్ తదితరులు పాల్గొన్నారు"

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వరి వేయొద్దని ప్రభుత్వ సూచనలు.. అయినా వరి సాగుకే రైతుల మొగ్గు! వరి వేయొద్దని ప్రభుత్వ సూచనలు.. అయినా వరి సాగుకే రైతుల మొగ్గు!
సిద్దిపేట జిల్లా ప్రతినిధి ;  సిద్దిపేట జిల్లా మొత్తంలో రైతులు అప్పుడే నార్లు పోయడం అప్పుడే దున్నకాలు కూడా అన్ని మండలాలలో వరికోసిన రైతులు ప్రారంభించారు ప్రభుత్వం...
ఆదిలాబాద్ లోఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి..చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే
సీతారాంపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం
యానగుందిని సందర్శించిన మాజీ ఎంపీ తనయుడు రాయపాటి రంగారావు
ఎల్ నినో వల్ల తాగు నీరు, పశుసంపద పై ప్రభావం - అదనపు కలెక్టర్ నగేష్
‘అడ్డొస్తే జేసీబీలతో తొక్కిస్తాం’ జెన్కో అధికారుల బరితెగింపు బెదిరింపులు!