పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

నవంబర్ 6 ఆఖరి గడువు... వెంటనే నమోదు చేసుకోవాలి , మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

రాయపర్తి  :     ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులు (గ్రాడ్యుయేట్లు) అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరి ఓటరుగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.సోమవారం రాయపర్తి మండల కేంద్రంలో పర్యటించిన ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ఓటు హక్కు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.పట్టభద్రుల ప్రతి ఇంటికి తిరుగుతూ అర్హులైన వారి వివరాలను సేకరించి,ఆన్లైన్ ద్వారా ఓటర్ గా నమోదు చేయించారు.ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ... ఓటరు నమోదుకు నవంబర్ 6వ తేదీ నాటితో తుది గడువు ముగుస్తుందని అన్నారు.మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ఉన్న అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటు నమోదు చేయించే బాధ్యత నాయకులు,కార్యకర్తలదేనని,గడువు లోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు మూనావత్ నరసింహ నాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి,మాజీ జడ్పిటిసి రంగు కుమార్,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
అందోల్ : పాపన్నపేట సబ్ డివిజన్ పరిధిలోని 4 మండలాలకు చెందిన ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నిర్వహించనున్నట్లు ఏఈ నవాజ్ ప్రకటించారు.ఈ మేరకు...
చౌటకూర్‌లో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యకు శ్రీకారం
కోయిలకొండ మండలంలో దారుణం.. చింతల్ తాండాలో మహిళ హత్య! ‎
డాన్స్ మాస్టర్ శేఖర్‌ను పరామర్శించిన జర్నలిస్టులు
కుక్కలు అడ్డురావడంతో అదుపుతప్పిన బైక్.. యువకుడికి తీవ్ర గాయాలు
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయ భూములకు డిజిటల్ సర్వే