ఆర్మూర్​లో ఏటీఎం చోరీకి యత్నం

ఆర్మూర్​లో ఏటీఎం చోరీకి యత్నం

నిజామాబాద్ :  ఆర్మూర్​ పట్టణంలో ఏటీఎం చోరీకి దొంగలు యత్నించారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్మూర్ పట్టణంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలోకి రాత్రివేళ ఇద్దరు దుండగులు ప్రవేశించారు. రాడ్​ సాయంతో ధ్వంసం చేశారు. అనంతరం నగదు ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. అయితే నగదు ఉన్న బాక్సులు ఓపెన్ కాకపోవడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. నిందితులు ఏటీఎం ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నాగర్‌కర్నూల్‌లో ప్రభుత్వ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వినతి నాగర్‌కర్నూల్‌లో ప్రభుత్వ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వినతి
నాగర్‌కర్నూల్ :  నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు...
ఆర్మూర్​లో ఏటీఎం చోరీకి యత్నం
టిఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడిగా సయ్యద్ సాదిక్ నియామకం
ఘనంగా సుప్రీత్ రెడ్డి జన్మదిన వేడుకలు
తక్కువ నీటితో సాగు.. ఆగ్రో ఫారెస్ట్రీతో అదనపు ఆదాయం
కౌడిపల్లి నూతన ఎసై గా నీరేష్.. జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎసై
దండి స్వామీజీ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలాధారణలు