తక్కువ నీటితో సాగు.. ఆగ్రో ఫారెస్ట్రీతో అదనపు ఆదాయం
ఉద్యాన అధికారి అర్చన.. కన్నాల రైతు వేదికలో రైతులకు అవగాహన, శిక్షణ
బెల్లంపల్లి (మంచిర్యాల జిల్లా): రైతులు తక్కువ నీటితో సాగు చేసే పంటలను ఎంచుకోవడంతో పాటు ఆగ్రో ఫారెస్ట్రీ ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని బెల్లంపల్లి ఉద్యాన అధికారి అర్చన సూచించారు. బుధవారం కన్నాల రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆగ్రో ఫారెస్ట్రీ పంటల సాగుపై రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చన మాట్లాడుతూ శ్రీగంధం, టేకు, సరుగుడు, యూకలిప్టస్, మునగ వంటి చెట్ల సాగు విధానాలు, వాటి యాజమాన్య పద్ధతులను వివరించారు. వెదురు సాగుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల గురించి తెలియజేశారు. అటవీ పంటల సాగుతో దీర్ఘకాలికంగా రైతులకు ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


