ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
పాలెం(నాగర్ కర్నూల్) : బిజినపల్లి మండలం ABVP పాలెం శాఖ ఆధ్వర్యంలో భారతదేశ ఉక్కు మనిషి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ABVP పాలెం శాఖ నగర కార్యదర్శి విష్ణు నాయుడు మాట్లాడుతూ.. దేశ ఐక్యత, సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. స్వాతంత్ర్యం అనంతరం అనేక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి దేశ సమైక్యతకు పటిష్టమైన పునాది వేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను నేటి యువత, విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ABVP కార్యకర్తలు జహంగీర్, ఆకాష్, చందు, బన్నీ, శరత్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


