నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల తహసీల్దార్ సస్పెన్షన్ అక్రమ భూ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో కలెక్టర్ వేటు

నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల తహసీల్దార్ సస్పెన్షన్ అక్రమ భూ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో కలెక్టర్ వేటు

నాగర్‌కర్నూల్ :  నాగర్‌కర్నూల్ జిల్లాలో అక్రమ భూ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కఠిన చర్యలు తీసుకున్నారు. ఉప్పునుంతల తహసీల్దార్ ఎ. సునీతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల ప్రకారం అచ్చంపేట డివిజన్ ఉప్పునుంతల మండలం అయ్యవారిపల్లిలో సర్వే నంబర్ 115కు సంబంధించిన భూ రికార్డుల్లో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. 13 ఎకరాల 17 గుంటల భూమి ఇతరుల పేర్లపై అక్రమంగా నమోదైనట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రాను విచారణ అధికారిగా నియమించారు. పాత పహాణీలు, ఖాస్రా, ఆర్‌ఓఆర్ రికార్డులు, భూ భారతి పోర్టల్ దరఖాస్తులు, డిజిటల్ సంతకాల ప్రక్రియపై విచారణ జరిపారు. విచారణలో అసలు రెవెన్యూ రికార్డులతో కొన్ని భూ నమోదులు సరిపోలలేదని తేలింది. పత్రాల ధృవీకరణలో లోపాలు, విధుల నిర్వహణలో వైఫల్యం ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. అప్పట్లో చారకొండ తహసీల్దార్‌గా పనిచేసిన ఎ. సునీతపై ఈ ఆరోపణలు రావడంతో ప్రస్తుతం డిప్యుటేషన్‌పై ఉప్పునుంతల తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమెను తెలంగాణ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం సస్పెండ్ చేశారు. క్రమశిక్షణా విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Views: 45

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇందిరా గాంధీ గారి ఆశయాలు, త్యాగాలు దేశ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం – డాక్టర్ నరేష్ జాదవ్ గారూ ఇందిరా గాంధీ గారి ఆశయాలు, త్యాగాలు దేశ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం – డాక్టర్ నరేష్ జాదవ్ గారూ
ఆదిలాబాద్ బ్యూరో : ఛలో ఢిల్లీ – ఓట్ బచావో, దేశ్ బచావో' కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఢిల్లీకి చేరుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు,...
సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఆశయాలు, ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
సింగరేణి సెక్యూరిటీ సిబ్బందికి ఫస్ట్ ఎయిడ్, ఫైర్ ఫైటింగ్ శిక్షణ పూర్తి
*రిమ్స్‌లో పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి..... జిల్లా కలెక్టర్ రాజర్షి షా
రేపే ప్రారంభం కానున్న ఎస్‌ఎల్‌ఎన్ సౌభాగ్య ప్రీమియా వెంచర్
నవంబర్ 30న తుది ఓటరు జాబితా విడుదల
బతికుండగానే చనిపోయినట్లు నమోదు.. పెన్షన్ కట్‌!