సింగూరు ప్రాజెక్టు నుంచి 0.15 టీఎంసీల నీటి విడుదల

నాలుగో, ఆరో, ఏడో గేట్లను 1.5 మీటర్ల మేర ఎత్తి 11,310 క్యూసెక్కుల నీరు విడుదల

సింగూరు ప్రాజెక్టు నుంచి 0.15 టీఎంసీల నీటి విడుదల

సంగారెడ్డి జిల్లా :  సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. తాగునీటి అవసరాల నిమిత్తం శనివారం మధ్యాహ్నం 1:55 గంటలకు ప్రాజెక్టులోని నాలుగో, ఆరో, ఏడో నంబరు గేట్లను అధికారులు తెరిచారు. ఒక్కో గేటును 1.5 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.మొత్తంగా మూడు గేట్ల ద్వారా 11,310 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ఈ నీటి విడుదల ద్వారా మొత్తం 0.15 టీఎంసీల నీటిని దిగువకు వదలాలని నిర్ణయించారు. ఈ మేరకు అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం 2:05 గంటలకు అధికారులు నీటి విడుదల వివరాలను ప్రకటించారు.

ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు, రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇందిరా గాంధీ గారి ఆశయాలు, త్యాగాలు దేశ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం – డాక్టర్ నరేష్ జాదవ్ గారూ ఇందిరా గాంధీ గారి ఆశయాలు, త్యాగాలు దేశ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం – డాక్టర్ నరేష్ జాదవ్ గారూ
ఆదిలాబాద్ బ్యూరో : ఛలో ఢిల్లీ – ఓట్ బచావో, దేశ్ బచావో' కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఢిల్లీకి చేరుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు,...
సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఆశయాలు, ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
సింగరేణి సెక్యూరిటీ సిబ్బందికి ఫస్ట్ ఎయిడ్, ఫైర్ ఫైటింగ్ శిక్షణ పూర్తి
*రిమ్స్‌లో పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి..... జిల్లా కలెక్టర్ రాజర్షి షా
రేపే ప్రారంభం కానున్న ఎస్‌ఎల్‌ఎన్ సౌభాగ్య ప్రీమియా వెంచర్
నవంబర్ 30న తుది ఓటరు జాబితా విడుదల
బతికుండగానే చనిపోయినట్లు నమోదు.. పెన్షన్ కట్‌!