1న ఆదిలాబాద్ పట్టణంలో జరిగే రైతు గర్జన సభను విజయవంతం చేయాలి - బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే జోగు,బాల్కసుమన్
రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా భరోసా ఇవ్వడానికే రైతు గర్జన సభ
ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం పట్ల వారికి భరోసా కల్పించడానికి మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరిక మేరకు నవంబర్ 1న ఆదిలాబాద్ డైట్ కాలేజి మైదానంలో సాయంత్రం 5 గంటలకు నిర్వహించే రైతు గర్జన సభకు కేటీఆర్ హాజరవుతరన్నారు. ఈ సందర్భంగా రైతు గర్జన సభకు సంభందించి హలొ రైతు ఛలో ఆదిలాబాద్ పోస్టర్ ను మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ విప్ బాల్క సుమన్ ల తో కలిసి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యలు ఆగాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆనాడు ఎదిరించి రాష్ట్రం సాధించిన రైతు కేసీఆర్ గారు రైతులకు అండగా నిలిచి వారిని రాజు చేశారు. మళ్ళీ కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరగడం బాధాకరమని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను కేటీఆర్ కలవనున్నారన్నారు. అనంతరం డైట్ మైదానాన్ని సందర్శించి పనులని పరిశీలించారు. జిల్లాలోని ప్రతీ రైతు నవంబర్ 1న రైతు గర్జన సభకు హాజరుకావలన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


