మంత్రులను కలిసిన గంభీరావుపేట ఏఎంసీ చైర్మన్ మరియు పాలక వర్గం
గంభీరావుపేట :
గంభీరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హమీద్ వైస్ చైర్మన్ మేడ భాస్కర్ మార్కెట్ కమిటీ సభ్యులశ్రీజ,సతీష్‌రెడ్డి,వేణుగోపాల్,రాజమల్లయ్య,సంతోష్,రఘువీరప్రసాద్,శ్రీనివాస్,రామ్, లక్కిరెడ్డిమధుసూదన్ రెడ్డి, నాగపురిరమేష్ గౌడ్,స్టీఫెన్,మురళి లు బుధ వారం హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు,పొన్నం ప్రభాకర్ గౌడ్,సిరిసిల్ల నియోజక వర్గం కాంగ్రేస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి లను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రులు చైర్మెన్ హమీద్ వైస్ చైర్మన్ భాస్కర్ మరియు డైరెక్టర్స్ లను శుభాకాంక్షలు తెలియజేశారు.చైర్మెన్ హమీద్ మాట్లాడుతూ, తనకు సహకరించిన మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ రాష్ట్ర నాయకులు పర్శ హన్మాండ్లు,ఫ్యాక్స్ చైర్మన్ వేషాల వెంకటి, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

