మల్లారం సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
మల్హర్ : మండలంలోని మల్లారం గ్రామ సర్పంచ్ మేకల రాజయ్య తండ్రి మేకల అప్పయ్య, దేనవేన కిష్టయ్యలు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మృతుల కుటుంబాలను పరామర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అధైర్యపడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ పరామర్శ కార్యక్రమంలో తాడిచెర్ల పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్, సర్పంచులు బండి స్వామి, కొండ రాజమ్మ, గడ్డం క్రాంతి, కాంగ్రెస్ నాయకులు రాజు నాయక్, లింగన్నపేట శ్రీధర్, రూపేష్ రావు, ప్రకాష్ రావు, రెవెళ్లి లింగయ్య, లింగన్నపేట మురళి, రమేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

