ఒకే పార్టీ.. వేర్వేరు నివాళులు..!

సూర్యాపేట కాంగ్రెస్‌లో ఐక్యత ఏది..? ఎవరి నివాసంలో వారే.. కాంగ్రెస్‌లో వర్గపోరు జోరే..! కలిసిరాని కాంగ్రెస్ నేతలు.. కలవరపడుతున్న కార్యకర్తలు.. వర్ధంతి వేళ మరోసారి బయటపడ్డ విభేదాలు..! ఒకే వేదికపై నివాళులర్పించలేని నేతలు.. కార్యకర్తల్లో చర్చ

ఒకే పార్టీ.. వేర్వేరు నివాళులు..!

సూర్యాపేట : సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వర్గ విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా ఒకే చోట సమావేశమై నివాళులర్పించాల్సిన సందర్భంలో, వేర్వేరు వర్గాలుగా విడిపోయి తమ తమ నివాసాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.పార్టీకి చెందిన ముఖ్య నాయకులంతా ఒకే వేదికపైకి వచ్చి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించాల్సి ఉండగా, వేర్వేరు ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించడం పార్టీ అంతర్గత పరిస్థితిని ప్రతిబింబిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే పట్టణ కాంగ్రెస్‌లో నాయకుల మధ్య సమన్వయ లోపం, వర్గ విభేదాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా వర్ధంతి కార్యక్రమాల్లోనూ ఈ పరిస్థితి కనిపించడంతో పార్టీ కార్యకర్తలు ఆలోచనలో పడ్డారు. పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉండాల్సిన సమయంలో ఇలా వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించడం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి కారణమవుతోందనే చర్చ వినిపిస్తోంది.కనీసం జాతీయ నాయకుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలైనా అందరూ కలిసి నిర్వహించలేని పరిస్థితి ఎప్పుడు మారుతుందోనని కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. సూర్యాపేట కాంగ్రెస్‌లో వర్గ విభేదాలకు అధిష్ఠానం లేదా స్థానిక నాయకత్వం ఎప్పుడు ముగింపు పలుకుతుందోనన్నది ప్రస్తుతం పట్టణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News