అచ్చంపేటలో ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమం
అచ్చంపేట(నాగర్ కర్నూల్) భారత మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ 42వ వర్ధంతి కార్యక్రమం అచ్చంపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో ఉన్న దివంగత ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ సమగ్రత, సార్వభౌమత్వం, ఆర్థికాభివృద్ధి, పేదల సంక్షేమం వంటి అంశాలకు తన పాలనలో ప్రాధాన్యమిస్తూ దేశ అభ్యున్నతికి ఇందిరా గాంధీ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. భారతదేశ రాజకీయ చరిత్రలో ధైర్యానికి, దృఢ సంకల్పానికి, నాయకత్వ పటిమకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ అని, ఎన్నో సవాళ్లు, ఒడిదుడుకులు ఎదురైనా దేశ ప్రయోజనాలే లక్ష్యంగా ఆమె సాగించిన ప్రస్థానం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


