నాగర్ కర్నూల్ జిల్లాలో ఘనంగా పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ - పండుగ సాయన్న జీవితం ధైర్యసాహసాలకు, సామాజిక చైతన్యానికి ప్రతీక అని అన్నారు. మహనీయుల జీవిత చరిత్రలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, వారి ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. యువత ధైర్యం, ఆత్మవిశ్వాసం, సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి విద్య ఎంతో కీలకమని, ప్రతి కుటుంబం పిల్లల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యతోనే సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని, సమాజంలో సమానత్వం, ఐక్యత, పరస్పర గౌరవం పెంపొందించాలని పిలుపునిచ్చారు. మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రా, డీఆర్ఓ పాండు, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిర తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


