ఘనంగాసర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి .
నాగర్ కర్నూల్ జిల్లా, (ఫోటో జర్నలిస్ట్ మల్లేష్ బాబు) : తెలకపల్లి లోఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 151 వ జయంతిని నిర్వహించారు శనివారం జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకున్నారు. మండల కేంద్రంలోని సిద్ధార్థ మోడల్ స్కూల్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శివ ప్రసాద్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ ఉక్కు మనిషి అని భారతదేశంలోని సంస్థానాలను ఏకం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు అని వారన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ అడుగుజాడలో ప్రతి ఒక్కరు నడవవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల విద్యార్థులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


