బెల్లంపల్లిలో పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌

75 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు స్వాధీనం

బెల్లంపల్లిలో పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌

బెల్లంపల్లి, (మంచిర్యాల జిల్లా) :  బెల్లంపల్లి టౌన్‌-2 పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రైల్వే రాడగంబాల బస్తీలో పోలీసులు బుధవారం ఆకస్మికంగా కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. బెల్లంపల్లి ఏసీపీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి రూరల్‌ సీఐ, టౌన్‌-1 ఇన్‌స్పెక్టర్‌, టౌన్‌-2 ఎస్‌ఐతో పాటు టౌన్‌-1, టౌన్‌-2, తల్లగురిజాల పోలీస్‌ స్టేషన్ల సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 75 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోరిక్షాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్థానిక యువకులు, విద్యార్థులు, ప్రజలకు మాదకద్రవ్యాల దుర్వినియోగం, సైబర్‌ నేరాలు, రహదారి భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలు, ఆస్తి నేరాలు, మహిళలు, వ్యక్తులపై జరిగే నేరాలపై ఏసీపీ అవగాహన కల్పించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, విద్యకు ప్రాధాన్యమిచ్చి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది పాల్గొన్నారు.

Views: 16

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఘనంగా సుప్రీత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా సుప్రీత్ రెడ్డి జన్మదిన వేడుకలు
కీసర : దమ్మాయిగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ సామల శ్రీనివాస్ రెడ్డి కుమారుడు సుప్రీత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ...
తక్కువ నీటితో సాగు.. ఆగ్రో ఫారెస్ట్రీతో అదనపు ఆదాయం
కౌడిపల్లి నూతన ఎసై గా నీరేష్.. జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎసై
దండి స్వామీజీ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలాధారణలు
ఓటు హక్కు వినియోగంపై యువతకు అవగాహన కల్పించాలి – మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్.
ఆదిలాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా గుట్టురట్టు*
3కోట్ల ఓట్ చోరీ కాంగ్రెసే - బీజేపీ నాయకులు అబ్బగోని అశోక్ గౌడ్