పండుగల సాయన్న 174వ జయంతి వేడుకలు ఘనంగా
ఈరోజు గండీడ్ మండల పరిధిలోని వెన్నచెడు గ్రామంలో పండుగల సాయన్న గారి 174వ జయంతి సందర్భంగా గ్రామంలోని ముదిరాజ్ బిడ్డలందరూ కలిసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నవనీత చెన్నయ్య గారు, మాజీ సర్పంచ్, మాజీ సర్పంచ్ బోయిని గోపాల్, అనంత లక్ష్మారెడ్డి,గంగుల పుల్లారెడ్డి గారు, పులిందర్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, కమ్మరి రమేష్ గారు, ముదిరాజ్ నరసింహులు గారు, అంతర్గాని రాములు గారు, గ్రామ పెద్దలు, ముదిరాజ్ ముద్దుబిడ్డ గువ్వల వెంకటన్న గారు, అలాగే దోమ వెంకటేష్, దోమ హనుమంతు, కోడియా కృష్ణ తదితర గ్రామ యువకులు పాల్గొన్నారు.
పండుగల సాయన్న గారి ఆశయాలను స్మరించుకుంటూ, ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ, గ్రామంలోని ముదిరాజ్ సోదరులందరూ ఐకమత్యంతో జయంతి వేడుకలను నిర్వహించడం విశేషం.
పండుగల సాయన్న గారికి ఘన నివాళులు!
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


