పందిల్ల టోల్ గేట్ నిర్మాణం పనులు ఆలస్యంగా జరగడం వలనే వాహనాదారులకు ఇబ్బందులు

పందిల్ల టోల్ గేట్ నిర్మాణం పనులు ఆలస్యంగా జరగడం వలనే  వాహనాదారులకు ఇబ్బందులు

హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల్ల స్టేజి దగ్గర ఎన్ హెచ్ రోడ్ పై టోల్ గేట్ నిర్మాణం పనులు నత్త నడక పనులు జరుగడం వలన వాహనదారులు ప్రతి రోజు ఇబ్బందులు పడుతున్నారని బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున్ రెడ్డి ఆరోపించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ నిర్మాణం పనులు ప్రారంభించి దాదాపు సంవత్సరం న్నర గడుస్తుంది అయినా పనులు పూర్తి చేయలేక పోయినారని వర్షం వస్తే బురుద ఎండ కొడితే దుమ్ముతో  బాదల మారిందన్నారు. కనీసం దుమ్ము ధూళితో ప్రజలు బాధ పడుతుంటే పట్టించుకునే నాథుడు కరువయ్యారని,ఎన్  హెచ్ పనులు ప్రారంభం అయి రెండున్నర సంవత్సరాలు గడుస్తుంది ఇంకా అక్కడ అక్కడ పనులు పూర్తి కాని పరిస్థితి ఉందన్నారు.నిర్మాణం పనులు పూర్తి కాకపోవడంతో వాహనాలు ప్రమాదలకు గురి అవుతున్నాయన్నారు.
కనీసం ఇప్పటికైన మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టించుకోని  ఎన్ హెచ్ రోడ్ పనులపై సమీక్షా చేయాలని కోరారు. టోల్ గేట్ నిర్మాణం పనులు వేగవంతం చేయాలని లేకుంటే బిఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటలకు దిగుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు అయిలేని గాల్ రెడ్డి, నీరటి రవీందర్, అలుమల్ల నర్సింహా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Views: 98

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఉప్పర్ గూడెంలో   డీసీఎంఎస్ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం ఉప్పర్ గూడెంలో   డీసీఎంఎస్ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
చౌటకూర్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని ఉప్పర్ గూడెంలో గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఘనంగా ప్రారంభించారు....
అడ్వాలపల్లిలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం
పందిల్ల టోల్ గేట్ నిర్మాణం పనులు ఆలస్యంగా జరగడం వలనే వాహనాదారులకు ఇబ్బందులు
ఎల్లమ్మ తల్లి టీ-స్టాల్ షాప్‌ ను ప్రారంభించిన...రమావత్.రవి నాయక్
అడ్వాలపల్లిలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం
జిల్లాస్థాయి క్రీడోత్సవాల్లో ఎడ్లపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ
70వ ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి పాఠశాలల అథ్లెటిక్స్ పోటీలలో హుస్నాబాద్ విద్యార్థికి ప్రథమ స్థానం