అడ్వాలపల్లిలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం

నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించిన కే డి సి సి బి బ్యాంకు అధికారులు - గ్రామ సర్పంచ్ అజ్మీరా సారక్క ఆధ్వర్యంలో.

అడ్వాలపల్లిలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం

మల్హర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని అడ్వాలపల్లి గ్రామంలో కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు  కే డి సి సి బి  (KDCCB) తాడిచర్ల శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత, నగదు రహిత లావాదేవీలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అజ్మీరా సారక్క అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు గ్రామ ప్రజలకు పలు బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ దుమ్మని లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతాలు ప్రారంభించి పొదుపు అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు. KDCCB బ్యాంకులో డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బ్యాంకు ద్వారా పంట రుణాలు, వ్యవసాయ రుణాలు, తనఖా రుణాలు, గృహ నిర్మాణ రుణాలు, విద్యా రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలు అందిస్తున్నట్లు వివరించారు.తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడం ద్వారా క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుందని, భవిష్యత్తులో రుణాలు పొందేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వంటి పథకాల ద్వారా తక్కువ ప్రీమియంతో బీమా రక్షణ పొందవచ్చని వివరించారు.

డిజిటల్ లావాదేవీలు నిర్వహించే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులతో ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర రహస్య సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని సూచించారు. ఖాతాదారుల విలువైన వస్తువుల భద్రత కోసం బ్యాంకులో లాకర్ సదుపాయం కూడా అందుబాటులో ఉందని తెలిపారు.బ్యాంకు అందిస్తున్న వివిధ సేవలను సద్వినియోగం చేసుకొని పొదుపు అలవాటును పెంపొందించుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని గ్రామ ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా యువజన నాయకులు అజ్మీరా బాలాజీ నాయక్, ఉపసర్పంచ్ బానోత్ రాజేందర్, సీఏఫ్ఎల్ ప్రతినిధి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి సరస్వతి, సీఈఓ సంతోష్, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ సదయ్య, బ్యాంకు సిబ్బంది, సంఘాల సిబ్బంది, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఉప్పర్ గూడెంలో   డీసీఎంఎస్ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం ఉప్పర్ గూడెంలో   డీసీఎంఎస్ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
చౌటకూర్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని ఉప్పర్ గూడెంలో గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఘనంగా ప్రారంభించారు....
అడ్వాలపల్లిలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం
పందిల్ల టోల్ గేట్ నిర్మాణం పనులు ఆలస్యంగా జరగడం వలనే వాహనాదారులకు ఇబ్బందులు
ఎల్లమ్మ తల్లి టీ-స్టాల్ షాప్‌ ను ప్రారంభించిన...రమావత్.రవి నాయక్
అడ్వాలపల్లిలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం
జిల్లాస్థాయి క్రీడోత్సవాల్లో ఎడ్లపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ
70వ ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి పాఠశాలల అథ్లెటిక్స్ పోటీలలో హుస్నాబాద్ విద్యార్థికి ప్రథమ స్థానం