70వ ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి పాఠశాలల అథ్లెటిక్స్ పోటీలలో హుస్నాబాద్ విద్యార్థికి ప్రథమ స్థానం
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (SGF) ఆధ్వర్యంలో 70వ ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి (సంగారెడ్డి, మెదక్ మరియు సిద్దిపేట జిల్లాల) పాఠశాలల 14 & 17 సంవత్సరాల బాలబాలికల విభాగాల అథ్లెటిక్స్ పోటీలు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ పోటీలలో 17 సంవత్సరాల బాలుర విభాగంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, హుస్నాబాద్ నందు ఎం.పి.సి మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి జి. రిశ్వంత్ 400 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం* సాధించి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యాడని హుస్నాబాద్ మండల పాఠశాలల SGF కార్యదర్శి ఆర్. శ్రీనివాస్ తెలియజేశారు.అనంతరం సిద్దిపేట పట్టణ ఏసీపీ రవీందర్ రెడ్డి రిశ్వంత్ ను గోల్డ్ మెడల్ తో సత్కరించారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా SGF కార్యదర్శి నర్రా భాస్కర్ రెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కె. వెంకటస్వామి, సీనియర్ పీడీలు సుజాత, రామేశ్వర్ రెడ్డి, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


