రోడ్లపై ధాన్యం ఆరబెడితే కట్టిన చర్యలు తప్పవు -ఎస్సై,అనిల్
భిక్కనూర్ : భిక్కనూర్ మండలప్రజలకు ప్రస్తుతం వరి ధాన్యం కోతలు, ధాన్యం ఆరబెట్టే సమయంలో కొంతమంది రైతులు రహదారులపై వరిధాన్యాలు ఆరబెట్టడం, ధాన్యం కుప్పలు పోయడం చేస్తున్నారు. దీనివల్ల రహదారులపై ప్రయాణించే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలగడమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం వల్ల కలిగే దుష్పరిణామాలు:రోడ్డు ప్రమాదాలు: రోడ్డుపై ధాన్యం ఉండటం వల్ల ద్విచక్ర వాహనాల టైర్లు జారిపోయి వాహనదారులు కిందపడే ప్రమాదం ఉంది. ప్రాణాపాయం: రహదారిపై ధాన్యం కుప్పలు ఉండటం వల్ల వాహనదారులు అకస్మాత్తుగా వాహనాలను మళ్లించాల్సి వస్తుంది. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొనే ప్రమాదం ఉంది.
. రాత్రివేళల్లో ప్రమాదాలు: చీకటిలో ధాన్యం కుప్పలు సరిగా కనిపించక వాహనదారులు వాటిని ఢీకొనే అవకాశం ఉంది.ట్రాఫిక్‌కు అంతరాయం: రహదారిపై ధాన్యం ఆరబెట్టడం వల్ల రోడ్డు అందుబాటులో ఉన్న భాగం తగ్గి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి.అత్యవసర సేవలకు ఆటంకం: రహదారులపై ధాన్యం కుప్పల కారణంగా అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు, ఇతర అత్యవసర వాహనాల రాకపోకలకు ఆటంకం కలగవచ్చు. -పోలీస్‌శాఖ హెచ్చరికకావున ఎవరైన రహదారులపై ధాన్యం ఆరబెట్టి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే వారిపై వర్తించే చట్టాలు, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి. కావున రైతులు ఈ విషయాన్ని గమనించి పోలీస్‌శాఖకు సహకరించాలి రైతుల పంట ఎంత ముఖ్యమో, ప్రజల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం. రోడ్డు భద్రత మనందరి బాధ్యత. కావున, రైతులు పోలీస్‌శాఖ సూచనలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని ఎస్సై అనిల్ మరియు పోలీసు సిబ్బంది విజ్ఞప్తి చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


