లొంగిపోయిన మావోయిస్ట్ ఆత్మహత్య
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ పునరావాస కేంద్రంలో విషాదం విచారణ ప్రారంభించిన పోలీసులు
చర్ల, (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): చర్ల మండల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పునరావాస కేంద్రంలో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది, పునరావాస పొంది, అక్కడ ఉపాధి శిక్షణ తీసుకుంటున్న ఒక మాజీ మావోయిస్ట్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారుమృతుడి వివరాలు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మాజీ మావోయిస్టును నరసూ బొడ్డు అలియాస్ నైతీ (26)గా గుర్తించారు, ఈయన బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్కానార్ గ్రామానికి చెందిన లక్ష్మయ్య బొడ్డు కుమారుడు, ప్రభుత్వ పునరావాస విధానంలో భాగంగా ఈ ఏడాది జూలై 23 నుండి ఆయన బీజాపూర్‌లోని పునరావాస కేంద్రంలో ఉంటూ వ్యవసాయం, మత్స్య పరిశ్రమ వంటి అంశాలలో శిక్షణ పొందుతున్నారుసంఘటన వివరాలుపోలీసుల కథనం ప్రకారం బుధవారం ఉదయం పునరావాస కేంద్రంలోని ప్రాంగణంలో నరసూ బొడ్డు అనుమానాస్పద రీతిలో ఉరివేసుకుని కనిపించాడు, ఈ వార్త తెలిసిన వెంటనే బీజాపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ ఎస్ ఎల్) బృందం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించాయి పోలీసులు మరియు కుటుంబ సభ్యుల స్పందనఈ ఘటనపై బీజాపూర్ పోలీస్ స్టేషన్లో మర్గ్ (అనుమానాస్పద మృతి) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు, మృతికి గల అసలు కారణాలను తెలుసుకోవడానికి సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, మేజిస్ట్రియల్ విచారణ కూడా ఆదేశించబడినట్లు బీజాపూర్ ఎస్పీ ఉమేష్ గుప్తా వెల్లడించారు, మరోవైపు మృతుని కుటుంబంలో కొద్ది రోజుల్లోనే పండగ వాతావరణంలో ఇంటికి రావాల్సి ఉండగా ఈ ఘటన జరగడం పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు, మృతుని సోదరుడు సతీష్ మాట్లాడుతూ మంగళవారం రాత్రి కూడా తనతో ఫోన్లో మాట్లాడాడని కుటుంబ సభ్యుల యోగా, క్షేమాలు,వివరాలు అడిగి ఉదయం మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పిన వ్యక్తి ఇలా బలవన్మరణానికి పాల్పడతాడంటే నమ్మలేకపోతున్నామని, దీని వెనుక ఉన్న నిజాలు తేలాలని కోరారు,ప్రభుత్వ ప్రధాన స్రవంతిలో కలిసి జీవించడానికి శిక్షణ పొందుతున్న క్రమంలో మాజీ మావోయిస్ట్ బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది, పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


