ప్రవళిక కుటుంబానికి అండగా రేవంత్ సర్కార్..

ప్రవళిక కుటుంబానికి అండగా రేవంత్ సర్కార్..

తల్లికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు!

ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా.. 

బ్యాంకు ప్రమాద బీమా కింద మరో కోటి రూపాయలు

ప్రవళిక మృతిపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి.. 

కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా

మార్చురీ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి నివాళులు.. 

దాడులకు పాల్పడితే కఠిన చర్యలు: మంత్రి హెచ్చరిక

కొత్తగూడెం  :  మణుగూరు డిపో మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ప్రవళిక కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేశారు. ఈ విషాద సమయంలో రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని, అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు.
మరోవైపు ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద ప్రవళిక పార్థివదేహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి నివాళులర్పించారు. అనంతరం ప్రవళిక తల్లిని పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో ఆర్టీసీ కుటుంబం పూర్తిగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున కలిపి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం మేరకు బ్యాంకు ద్వారా ప్రమాద బీమా కింద మరో కోటి రూపాయలు అందనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ కుటుంబ సభ్యురాలిని కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ప్రవళికకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమెను కాపాడుకోలేకపోయామని విచారం వ్యక్తం చేశారు.

దాడులను సహించేది లేదు.. చట్టపరమైన చర్యలు తప్పవు!

ఈ ఘటనలో బాధ్యుడిపై హత్య కేసు నమోదు చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీసీ సిబ్బంది ఎవరైనా ప్రయాణికుల పట్ల తప్పుగా ప్రవర్తిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడకూడదని హెచ్చరించారు.

కార్మికుల భద్రత.. ప్రయాణికుల సౌకర్యం రెండూ ముఖ్యం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి అనేక నిర్ణయాలు తీసుకుందని మంత్రి పేర్కొన్నారు. కార్మికుల భద్రతతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కూడా ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులను దేవుళ్లుగా భావించి సేవలందించాలని, ప్రయాణికులు సైతం సిబ్బంది పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఏవైనా సమస్యలు ఎదురైతే చట్టపరంగా ఫిర్యాదు చేయాలే తప్ప దాడులకు దిగడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రవళికను తిరిగి తీసుకురాలేకపోయినా, ఆమె కుటుంబానికి ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలా అండగా నిలుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.

Views: 119

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఘనంగా సుప్రీత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా సుప్రీత్ రెడ్డి జన్మదిన వేడుకలు
కీసర : దమ్మాయిగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ సామల శ్రీనివాస్ రెడ్డి కుమారుడు సుప్రీత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ...
తక్కువ నీటితో సాగు.. ఆగ్రో ఫారెస్ట్రీతో అదనపు ఆదాయం
కౌడిపల్లి నూతన ఎసై గా నీరేష్.. జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎసై
దండి స్వామీజీ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలాధారణలు
ఓటు హక్కు వినియోగంపై యువతకు అవగాహన కల్పించాలి – మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్.
ఆదిలాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా గుట్టురట్టు*
3కోట్ల ఓట్ చోరీ కాంగ్రెసే - బీజేపీ నాయకులు అబ్బగోని అశోక్ గౌడ్