ప్రభుత్వ పాఠశాల అభివృద్దికి ఉపాద్యాయురాలి చేయూత
స్టేషన్ ఘన్పూర్ : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని, విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించేందుకు ముందుకు రావాలని ఎంఈవో కుసుమ రమేష్ అన్నారు. స్టేషన్ ఘన్పూర్ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ శివునిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు అదే పాఠశాలలో సోషల్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న కె రజని తన వంతు సహకారంగా రూ 40 వేల విలువైన కంప్యూటర్, ప్రింటర్‌ను శనివారం విరాళంగా అందజేశారు. ఈసందర్భంగా రమేష్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో కంప్యూటర్, ప్రింటర్‌ను అందించడం అభినందనీయమని అన్నారు. ఉపాధ్యాయురాలు రజని చేసిన ఈ సహకారం పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు చూపిస్తున్న చొరవ ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె ప్రవీణ్ కుమార్, శ్రీనికాంత్, లక్ష్మీ ప్రసాద్, ఈ రమేష్, కృష్ణవేణి, అరుణ, శ్రీదేవి, సురేఖ, జి రవి, రాధాకృష్ణ, టి శ్రీనాథ్, నళినీబాయి తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


