ఘనంగా మాజీ ప్రధాని వర్ధంతి వేడుకలు
లక్షెట్టిపేట : పట్టణంలోని స్థానిక ఐబీ గెస్ట్‌హౌస్‌లో మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ 42వ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ.. దేశ ఐక్యత, సమగ్రత, పేదల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు. దేశాభివృద్ధి కోసం ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, చూపిన ధైర్యం, ప్రజాసంక్షేమం పట్ల ఆమెకు ఉన్న నిబద్ధత చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ ఆశయాలు, ఆదర్శాలు కాంగ్రెస్ పార్టీకి నేటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.
ఆమె చూపిన మార్గంలో పయనిస్తూ రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశంలో ప్రజాస్వామ్య విలువలు, సమానత్వం, సామాజిక న్యాయం మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. దేశం కోసం, ప్రజల సంక్షేమం కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు షాహిద్ అలీ, మున్సిపల్ చైర్పర్సన్ దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్పర్సన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్, పీసీఏఎస్ చైర్మన్ చెల్ల నాగభూషణం, కౌన్సిలర్లు చింత అశోక్ కుమార్, ఆరిఫ్, పెండం రాజు, చిన్న రమేష్, ఉత్తూరి రవీందర్, నర్సింహాచారి, హజీ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


