బిజెపి ఆధ్వర్యంలో సర్పక్రియ పై మేదావుల సమావేశం
హుస్నాబాద్ : దేశంలో సర్ పక్రియ జరుగుతున్న తీరుపై ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను బిజెపి పార్టీ కేంద్ర ప్రభుత్వం గమనిస్తుందని,ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు సుప్రీంకోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘంను తప్పుపట్టే విధంగా రాజ్యాంగ వ్యవస్థ కించపరిచే విధంగా కొన్ని శక్తులను ప్రయత్నిస్తున్నందున ఈ నేపథ్యంలో ప్రజలకు జాగృత పరిచే ఉద్దేశంతో హుస్నాబాద్ పట్టణంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో మొదట మేధావులతో చర్చిద్దాం అని తెలంగాణ బిజెపి పార్టీ నిర్ణయించిందని బిజెపి నాయకులు తెలిపారు. మంగళవారం సాయంత్రం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో మేధావుల సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధికారప్రతినిధి మరియు ఐటీ సెల్ ఇంచార్జి పోరెడ్డి కిషోర్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా బిజెపి నాయకులు కిషోర్ రెడ్డి మేధావుల సమావేశం నూద్దెశించి మాట్లాడుతూ 1950 నుండి ఇప్పటికి 12 సార్లు ఎన్నికలు జరిగాయని,గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా గెలిచిందని, తెలంగాణలో కాంగ్రెస్ ఎలా గెలిచిందని ప్రశ్నించారు. సర్ పక్రియ పూర్తిగా రాజ్యాంగబద్ధమైనదని, ఎన్నికల జాబితాను ఎలాంటి గందరగోరం లేకుండా పారదర్శకంగా నిర్వహించడమే దీని లక్ష్యం అన్నారు. ఎన్నికల జాబితా నుండి 1.3 కోట్ల మంది ఓటర్లను తొలగించారని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖార్గే ఆరోపించడంపై పూర్తిగా అవాస్తవం అన్నారు.దేశంలో చనిపోయిన వారి పేర్లు తొలగించవద్దని ప్రశ్నించారు. విదేశీ చొరపాటుదారుల ఓట్లు మాత్రమే ఈ ప్రక్రియ ద్వారా తొలగిస్తున్నట్లు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ కావాలని సర్ప క్రియపై కేంద్రంపై దృష్టాచారం చేస్తుందని తెలిపారు.ఈ సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వెంకటేశం బిజెపి నాయకులు లక్కిరెడ్డి తిరుమలరెడ్డి,దొడ్డి శ్రీనివాస్,భూక్య సంపత్ నాయక్, తగరపు లక్ష్మణ్, తోట సమ్మయ్య, తోట స్వరూప, రామంచ మహేందర్ రెడ్డి, వెల్దండి రాజేంద్రప్రసాద్, జనగామ వేణుగోపాలరావు, గొల్లపల్లి వీరాచారి, రాయికుంట చందు,బోడిగే వెంకటేష్ నాయకులు కార్యకర్తలు మేధావులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


