గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక కృషి – డిజిటల్ లైబ్రరీ నుంచి నూతన భవనాల మంజూరు వరకు...
మెదక్ : మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ గా చిలుముల సుహాసిని రెడ్డి బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో విశేష పురోగతి సాధించారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జిల్లాలోని గ్రంథాలయాల్లో నెలకొన్న అనేక సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి డిజిటల్ లైబ్రరీ ఏర్పాటులో కీలకంగా కృషి చేసి, విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. నూతన గ్రంథాలయాల ఏర్పాటు – భవనాల మంజూరుకు కృషి వెల్దుర్తిలో నూతన గ్రంథాలయ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపడంతో పాటు, గ్రంథాలయానికి సొంత భవనం కల్పించే దిశగా నూతన భవన నిర్మాణానికి మంజూరు సాధించడం విశేషం. గ్రంథాలయాలకు మెరుగైన భవనాలు, మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో ఆమె చేస్తున్న కృషి జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి కొత్త ఊపునిచ్చింది.
నర్సాపూర్ గ్రంథాలయానికి అభివృద్ధి బాట
అదేవిధంగా నర్సాపూర్ గ్రంథాలయ శాఖను అభివృద్ధి పథంలో నడిపిస్తూ, గ్రంథాలయానికి వచ్చే పాఠకులు, నిరుద్యోగులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు.
రీడింగ్ హాళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని, వారి అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
విద్యార్థుల కోసం సేవా కార్యక్రమాలు
నర్సాపూర్ గురుకుల పాఠశాలలో పుస్తకాల సంఖ్యను పెంచడం ద్వారా విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు ప్రత్యేక సేవా కార్యక్రమం చేపట్టారు. పుస్తక పఠనం ద్వారా విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు పోటీ ప్రపంచంలో వారు రాణించేలా ప్రోత్సహిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు
జిల్లాలోని వివిధ గ్రంథాలయాల్లో మౌలిక వసతుల మెరుగుదల, పుస్తకాల సమకూర్పు, పాఠకులకు అవసరమైన సౌకర్యాల కల్పన, రీడింగ్ హాళ్ల అభివృద్ధి, విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తున్నారు.
రెండేళ్ల ప్రస్థానంలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు, వెల్దుర్తిలో నూతన గ్రంథాలయ ఏర్పాటు, నూతన భవన నిర్మాణానికి మంజూరు, నర్సాపూర్ గ్రంథాలయ అభివృద్ధి, విద్యార్థులకు పుస్తకాల అందజేత వంటి కార్యక్రమాలు ఆమె పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
రెండేళ్ల ప్రస్థానం సందర్భంగా ఘన సన్మానం
చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈరోజు మెదక్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ కార్యదర్శి మరియు గ్రంథాలయ సిబ్బంది చిలుముల సుహాసిని రెడ్డి ని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెండేళ్లలో గ్రంథాలయాల అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను గుర్తుచేసుకుంటూ, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.
మరింత అభివృద్ధే లక్ష్యం
రెండేళ్ల ప్రస్థానం మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నాంది కావాలని, రానున్న రోజుల్లో మెదక్ జిల్లాలోని ప్రతి గ్రంథాలయాన్ని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్ది విద్యార్థులకు, నిరుద్యోగులకు విజ్ఞాన కేంద్రాలుగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
గ్రంథాలయాలు కేవలం పుస్తకాలు చదివే కేంద్రాలుగా కాకుండా విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే విజ్ఞాన దేవాలయాలుగా మారాలనే సంకల్పంతో చైర్ పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయం. రానున్న రోజుల్లోనూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మెదక్ జిల్లా గ్రంథాలయాలకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షిద్దాం.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


