అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి రూ.5 వేల ఆర్థిక సాయం
మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన
కల్వకుర్తి : కల్వకుర్తి మండలం జేపీ నగర్ తండాకు చెందిన జానీ అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యంతో కలిసి ఆసుపత్రికి వెళ్లి జానీని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని ఆకాంక్షిస్తూ రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పుట్ట రాంరెడ్డి, వార్డు సభ్యులు సునీత ఆనంద్, నరేష్, కిషోర్, గోపాల్, నాయకులు రామకృష్ణ, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


